జనవ్యవహారంలో దుష్టపద ప్రయోగాలు, దుష్ట సంధులు చేయడం ఎక్కువైంది. భాషసరళీకరణ పేరుతో యథేచ్ఛగా ఈ విధంగా తత్సమ, తద్భవాలను, తెలుగు ఆంగ్లపదాలను కలిపి వినియోగించడం వల్ల క్రమేపీ తెలుగుభాష స్వీయ అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏది సంస్కృతమో, ఏది తెలుగో, ఏది తత్సమమో, ఏది తద్భవమో తెలియనివారే ఎక్కువవుతున్నారని భావిస్తున్నారు.
సామాన్య జన వ్యవహారంలో వ్యావహారిక భాషపేరుతో అన్య దేశ్య భాషాపదాల వాడుక అవసరమనీ, దానివల్ల తెలుగుభాష కొన్నిమార్పులకు గురైనప్పటికీ ఆంగ్లభాష అన్యభాషా పదజాలాన్ని కలుపుకుంటున్నట్లే తెలుగుభాష కూడా తన అస్తిత్వం నిలబెట్టుకోగలుగుతుందని మరికొంతమంది అంటున్నారు.
ఇటీవల పత్రికలలో, హెూర్డింగ్లలో 'పాలాభిషేకం' అనే పదాన్ని చాలామంది గమనించేఉంటారు. అలా కాదు.. 'క్షీరాభిషేకం' అనాలని కొందరు సూచిస్తున్నారు. కారణం..క్షీరం, అభిషేకం రెండూ సంస్కృతపదాలు. వాటిని కలిపి వాడవచ్చు.. పాలు, అభిషేకం అలా కాదు.. పాలు తెలుగైతే, అభిషేకం సంస్కృతం. చాలామంది అసలు ఏపదమేమిటోతెలియకుండానే వాటిని వాడేస్తున్నారు. అది భాషను దెబ్బతీస్తుందని పలువురి అభిప్రాయం.
ఈ విషయం మీద మీ అభిమాన తెలుగులోకం పత్రిక చర్చకుస్వాగతిస్తోంది. మీ అభిప్రాయాలను తెలుగులోకం వాట్సాప్ నెం. 9010221299కుగానీ, kameswararaobulusu 11@gmail.com మెయిల్ అడ్రస్కు గాని పంపగలరు.